శ్రీశైలంలో ..అద్బుత స్వరఝరి

updated: March 9, 2018 20:19 IST
శ్రీశైలంలో ..అద్బుత స్వరఝరి

ఈ నెల ఏడవ తేదీన శివ భక్తులంతా భూకైలాసంగా భావించే శ్రీశైల ఫుణ్యక్షేత్రంలో ప్రముఖ  కర్ణాటక విధ్వాంసులు  శ్రీ  మోదుమూడి సుధాకర్ గారి  సంగీత కచేరి జరిగింది. భక్తులను పరవశింపజేసేలా సాగిన ఈ కచేరీని శ్రీశైల దేవస్దానం వారు ఏర్పాటు చేసారు.  ఈ కచేరిలో భాగంగా పాడిన పంతువరాలి రాగంలో శివ శివ అనరాద అనే త్యాగరాజు కృతి ఆహుతులను విశేషంగా అలరించింది. కచేరి అనంతరం శ్రీ శృంగేరి శారదా ఉత్తర పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీస్సులు అందచేయటం జరిగింది.

ఇక మోదుమూడి సుధాకర్ గారి  విశేషాలకు వస్తే... ఇంట్లో చిన్నప్పటి నుంచి సంగీత వాతావరణం ఉండేది. వారి తండ్రి గారు కూడా సంగీతం నేర్చుకున్నారు.  వారి నాన్నగారి మేనమామ గాయక సార్వబౌమ పారేపల్లి రామకృష్ణ పంతులుగారు. ఆయన త్యాగరాజ స్వామి శిష్య పరంపరంలో మూడవ తరానికి చెందిన వారు.  తొమ్మిటి యేట నుంచే సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టిన  ఈయన  ప్రముఖ వయిలిన్ విధ్వాంసులు అన్నవరపు రామస్వామిగారి వద్ద శిష్యరికం చేసారు. 

ఈయన ప్రధానంగా కర్ణాటక సంగీత గాత్ర కళాకారులు. గత ఇరవై ఆరేళ్లుగా ఉద్యోగం..విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో గ్రేడ్ వన్ మ్యూజిక్ కంపోజర్ గా  ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని వందల లలిత గీతాలకు, భక్తి గీతాలకు ఆయన సంగీతం స్వరపరిచారు. ఇక ఆయన సంగీత ప్రపంచానికి తన వంతు సేవగా స్వరఝరి అనే సంస్దను 1988 నుంచి నడుపుతున్నారు.ఈ ముప్పై ఏళ్లలో ఒక్క నెల కూడా విడిచి పెట్టకుండా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు దేశ,వేదేశాల నుంచి కూడా  పిలిపించి  కచేరీ పెడుతున్నారు. వీరికి దేశ విదేశాల్లలో వందలాది మంది శిష్యులు ఉన్నారు . వారిలో మోహన వంశి,మల్లాది స్వాతి, ప్రముఖ గాయకుడు,మ్యూజిక్ డైరెక్టర్ రాణి శ్రీనివాస శర్మ,  ప్రముఖ గాయనీ మణులు శృతి రంజని ,మరియు భమిడిపాటి శ్రీ లలిత  ఉన్నారు 
 

 


Tags: Modumudi sudhakar, parepally ramakrishna pantulu, annavarapu ramaswami

comments